స్కాట్లాండ్లోని గ్లాస్గో విమానాశ్రయం పరిధిలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. స్టిర్లింగ్లోని డ్రైమెన్ గ్రామానికి ఈశాన్య దిశలో జరిగిన తేలికపాటి విమాన ప్రమాదంలో 16 ఏళ్ల బాలుడు, 80 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు క
ోల్పోయారు. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని
సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ ప్రాంతంలో డ్రోన్లు, విమానాలపై అధికారులు తాత్కాలికంగా ఆంక్షలు విధించారు.