భూమి కోసం గొడ‌వ‌.. డాక్ట‌ర్ దారుణ హ‌త్య‌!

6040பார்த்தது
భూమి కోసం గొడ‌వ‌.. డాక్ట‌ర్ దారుణ హ‌త్య‌!
మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్గావ్ జిల్లాలోని గొరాడ్‌ఖేడా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూమి విష‌యంలో జరిగిన గొడవ ఓ డాక్ట‌ర్ ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన డాక్ట‌ర్ సంజ‌య్ తేలి రూ.1.25 కోట్ల విలువైన వ్య‌వ‌సాయ‌ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి రూ.80 ల‌క్ష‌లు చెల్లించాడు. అయితే భూమి బేరానికి మ‌ద్య‌వ‌ర్తిగా ఉన్న‌ ల్యాండ్ ఏజెంట్ ధ‌ర్మ‌రాజ్ పాటిల్ రూ.1.90 ల‌క్ష‌ల క‌మిష‌న్ డిమాండ్ చేశాడు. అందుకు డాక్ట‌ర్ నిరాక‌రించాడంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ల్యాండ్ ఏజెంట్ దాడి చేయడంతో డాక్టర్ మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி