బిహార్లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంకాట్ గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు శుక్రవారం ఉదయం స్థానిక చెరువుకు స్నానానికి వెళ్లారు. వీరిలో నలుగురు నీటిలోకి దిగగా.. లోతు అంచనా వేయలేక మునిగిపోయారు. ఒడ్డున ఉన్న మరో బాలిక విషయాన్ని గ్రామస్థులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చేపట్టి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా.. అందరి వయసు 13 ఏళ్లలోపే. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.