పంజాబ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగీలు

9021பார்த்தது
పంజాబ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు బోగీలు
పంజాబ్‌లోని బటిండా సమీపంలోని రాంపురా ఫూల్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం కార్లను తీసుకెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. బటిండా నుంచి అంబాలా వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమని  అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే, మహారాష్ట్రలోని కలంబోలి యార్డులో మంగళవారం మరో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.

டேக்ஸ் :