హైదరాబాద్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎల్నినో పేరుతో ప్రభుత్వం తన చేతకానితనాన్ని ప్రకృతిపై నెట్టేస్తోందని ఆయన విమర్శించారు. గత 6 నుంచి 9 నెలలుగా ఎల్నినో ముప్పు గురించి తెలిసినా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. పంటలు వేయవద్దని సీఎం చెప్పడం రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తోందని, తెలంగాణలో క్రాప్ హాలీడే ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.