హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.3 కోట్లలోపు డిపాజిట్లపై ఈ సవరించిన రేట్లు నవంబర్ 4, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ కొన్ని కాలపరిమితులపై 0.50 శాతం(50 బేసిస్ పాయింట్లు) వరకు వడ్డీని పెంచింది. తాజా నిర్ణయంతో సాధారణ ఖాతాదారులకు గరిష్ఠంగా 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. 61 రోజుల నుంచి ఆరు నెలల లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. పెట్టుబడిదారులు నిబంధనలను పరిశీలించి పెట్టుబడి పెట్టడం మంచిది.