TG: హైదరాబాద్ ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం విధుల్లో విషాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కె.వెంకన్న (55)ను గుర్తుతెలియని బైక్ ఢీకొని పరారైంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వెంకన్నను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.