వేడి టీతో క్యాన్సర్ ముప్పు.. హెచ్చరిక!

7632பார்த்தது
వేడి టీతో క్యాన్సర్ ముప్పు.. హెచ్చరిక!
భారతదేశంలో ఉదయాన్నే వేడి టీ తాగే అలవాటు చాలా మందికి ఉంది. అయితే, 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 65°C కంటే ఎక్కువ వేడిగా ఉన్న టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. 10 లక్షల మందిపై జరిగిన ఈ అధ్యయనంలో, రోజుకు ఆరు కప్పుల కంటే ఎక్కువ వేడి టీ తాగేవారికి క్యాన్సర్ ముప్పు 71 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చింది. వేడి టీ తాగడం వల్ల నోరు, గొంతు, ఆహార నాళం దెబ్బతినే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி