మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఇలా చేయండి!

4046பார்த்தது
మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఇలా చేయండి!
ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిదానికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అయితే, ఆధార్‌లోని వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు బయోమెట్రిక్ లాకింగ్ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని యూఐడీఏఐ పోర్టల్ లేదా ఆధార్ యాప్ ద్వారా సులభంగా లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లి ఆధార్ ఆప్షన్ కేటగిరీ ఎంచుకుని ఆధార్ లాక్ లేదా అన్‌లాక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. యూఐడీ లాక్ ఆప్షన్ ఎంచుకుని వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి. అన్‌లాక్ కూడా ఇదే పద్దతిలో చేయాలి.

தொடர்புடைய செய்தி