ఆధార్ కార్డు భద్రతను పటిష్టం చేసేందుకు UIDAI లాక్, అన్‌లాక్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వినియోగదారులు మై ఆధార్ పోర్టల్ లేదా అధికారిక యాప్ ద్వారా తమ లాక్ చేసిన ఆధార్‌ను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు. ఈ ప్రక్రియలో 16 అంకెల వర్చువల్ ఐడి (VID), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ధృవీకరణ తప్పనిసరి. భద్రతా కారణాల దృష్ట్యా ఎల్లప్పుడూ అధికారిక UIDAI వేదికలను మాత్రమే వినియోగించాలని సూచిస్తోంది.