కరెంట్‌ ఆదా కోసం ఏసీని ఎలా వాడాలంటే?

52பார்த்தது
కరెంట్‌ ఆదా కోసం ఏసీని ఎలా వాడాలంటే?
వేసవిలో ఏసీ వినియోగం పెరగడంతో విద్యుత్ బిల్లుల భారం పెరుగుతోంది. ఇన్వర్టర్ ఏసీలను తరచుగా ఆన్, ఆఫ్ చేయడం కంటే, 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద నిరంతరాయంగా నడపడం వల్ల విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 18 డిగ్రీల వద్ద ఏసీని సెట్ చేయడం వల్ల గది వేగంగా చల్లబడదు. పైగా కంప్రెసర్‌పై భారం పడుతుంది. గది ఖాళీగా ఉన్నప్పుడు ఏసీని కచ్చితంగా ఆపివేయడం, కిటికీలు మూసి ఉంచడం, క్రమం తప్పకుండా ఫిల్టర్లను శుభ్రం చేయడం వంటి చిట్కాలు పాటించడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

தொடர்புடைய செய்தி