ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోతున్నాయా?.. ఇలా ఉపయోగించండి!

3382பார்த்தது
ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోతున్నాయా?.. ఇలా ఉపయోగించండి!
కిరాణా సరుకులతో ఇంట్లోకి వచ్చే ప్లాస్టిక్‌ కవర్లను పడేయకుండా కొన్ని పనులకు తిరిగి ఉపయోగించుకోవచ్చు. చిన్న చెత్తబుట్టలకు లైనర్‌గా, ప్రయాణాల్లో చెప్పులు, తడి దుస్తులను వేరుగా ఉంచేందుకు వీటిని వినియోగించవచ్చు. కారులో పొడి చెత్త సేకరించడానికి, చిన్న వస్తువులు, ఛార్జింగ్‌ కేబుళ్లను వేర్వేరుగా భద్రపరచడానికి కూడా ఉపయోగపడతాయి. ఇంట్లో రంగులు వేయించేటప్పుడు వస్తువులను కప్పేందుకు, సీజనల్‌ సామగ్రిని దుమ్ము నుంచి కాపాడేందుకు ఉపయోగించవచ్చు. అయితే తడి వస్తువులను ఎక్కువసేపు కవర్లలో ఉంచకూడదు. వీలైనంత వరకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగ సంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி