సాధారణంగా సంక్రాంతి సీజన్లో ఉండే బాక్సాఫీస్ హడావుడి ఈసారి నవంబర్ నెలలోనే కనిపిస్తోంది. డిసెంబర్, సంక్రాంతి విడుదల తేదీలు ఖరారు కావడంతో.. నిర్మాతలు నవంబర్‌ను ఎంచుకున్నారు. నవంబర్ 5న 'రామాయణం: పార్ట్ 1', నవంబర్ 6న సీన్, మహాశక్తి, సమ్మర్ హాలిడేస్ విడుదల కానున్నాయి. అలాగే నవంబర్ 12, 13 తేదీల్లో భోగి, గోట్, 19, 20 తేదీల్లో ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓం, సత్యవాన్ సావిత్రి, 27న మైసా, హైందవ, హై చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ వరుస చిత్రాల విడుదల సినీ ప్రియులలో ఆసక
్తిని కలిగిస్తోంది.