శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ పట్టివేత

3845பார்த்தது
శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ పట్టివేత
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను భగ్నం చేశారు. దోహా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీలో చాక్లెట్ల రూపంలో దాచిపెట్టిన సుమారు రూ.24 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని లగేజీని తనిఖీ చేయగా ఈ డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ ఉందా అనే కోణంలో DRI అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

தொடர்புடைய செய்தி