ఏపీలో మురసు తుఫాన్ ప్రభావం.. 8 మంది మృతి

24பார்த்தது
ఏపీలో మురసు తుఫాన్ ప్రభావం.. 8 మంది మృతి
AP: మురసు తుఫాను కారణంగా బాపట్ల జిల్లాలో ఐదుగురు, గుంటూరులో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్తులో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 390 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొని, బాధితులకు 52,768 ఆహార పొట్లాలు, 43,954 తాగునీటి ప్యాకెట్లు అందించారు. అలాగే ప్రజలకు 5.87 కోట్ల ముందస్తు హెచ్చరిక సందేశాలు పంపారు. దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ పనులపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி