అఫ్గాన్తో జరిగిన మూడో టీ20లో
భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని అఫ్గాన్ ఛేదించలేకపోయింది. 94 పరుగులు చేసి 14.1 ఓవర్లకే కుప్పకూలింది. జద్రాన్(25), గుర్బాజ్(15), ఒమర్జాయ్(17), రహ్మాన్(11), నబీ(8), రషీద్ ఖాన్(6) పరుగులు చేశారు.
భారత్ బౌలర్లలో నితీశ్ 3, రవి బిష్ణోయ్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా, యష్ ఠాగూర్ చెరో వికెట్ తీశారు. కాగా
భారత్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.