దశాబ్దాలుగా క్యూబాపై
అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి
భారత్ మద్దతు పలికింది.
అమెరికా ఒత్తిళ్లను పక్కనబెట్టి, మానవీయ దృక్పథంతో
భారత్ స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. 193 దేశాలలో 130 దేశాలు ఆంక్షలకు వ్యతిరేకంగా ఓటు వేయగా, అందులో
భారత్ కూడా ఉంది. ఆంక్షల వల్ల క్యూబాలో మందులు, ఆహార కొరత ఏర్పడుతోందని భారత ప్రతినిధి సౌమ్య నాయర్ పేర్కొన్నారు.