ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ బ్రెయిన్ హెమరేజ్ అయిందని, కోమాలోకి వెళ్లి చనిపోయారంటూ గత కొద్ది రోజులుగా SMలో ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ ఆ దేశ మీడియా తాజాగా కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఫొటోల్లో కిమ్ అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఒక గార్మెంట్ అండ్ ఫుట్వేర్ ఎగ్జిబిషన్లో పిల్లల బూట్లు, మహిళల కోట్లను ఆయన పరిశీలిస్తున్నట్లు ఆ ఫొటోల్లో ఉంది. కిమ్ తర్వాత పవర్లోకి ఎవరు వస్తారనే విషయంపై భారీ ఎత్తున చర్చ జరుగుతున్న టైమ్లో ఈ ఫొటోలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.