ప్రముఖ టెలికాం సంస్థ
రిలయన్స్ జియో, తన పదేళ్ల వేడుకల్లో భాగంగా 'హ్యాపీ న్యూ ఇయర్ 2.0' పేరుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. రూ.399 నెలవారీ ప్లాన్, రూ.3,999 వార్షిక ప్లాన్లతో పాటు స్వల్పకాలిక ప్యాక్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్ల ద్వారా అపరిమిత 4జీ, 5జీ డేటా, కాల్స్, ఎస్సెమ్మెస్ సదుపాయాలతో పాటు కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్,
జియో హాట్‌స్టార్ మరియు ఏఐ క్లౌడ్ ప్రయోజనాలను సంస్థ కల్పిస్తోంది. రాత్రి వేళల్లో డేటా వినియోగం కోసం రూ.50తో కొత్త నైట్ ప్యాక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.