పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దాని సీక్వెల్ ‘కల్కి-2’పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడి విజన్ను పూర్తిగా నమ్మే
ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరకడం నా అదృష్టం. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ‘కల్కి-2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది జూన్ నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. తొలి భాగం కంటే భారీ స్థాయిలో, మరెన్నో బలమైన ఎమోషన్స్తో ఈ సీక్వెల్ ఉండబోతోంది’’ అని వెల్లడించారు.