బాన్సువాడ - Banswada

வீடியோஸ்


కామారెడ్డి జిల్లా
ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీకి ఘన నివాళి
Oct 02, 2026, 17:10 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీకి ఘన నివాళి

Oct 02, 2026, 17:10 IST
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో శుక్రవారం మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకు వచ్చిన గొప్ప నాయకుడు గాంధీజీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మత్తమాల భాగ్యమతి, కౌన్సిలర్లు, సొసైటీ వైస్ చైర్మన్, కో- ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కమిషనర్, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.