TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై మాజీ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. ‘
కేసీఆర్ చాలా మంచివారు. మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనలేదు. ఎప్పుడెళ్లినా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఆయనలో హుందాతనం ఉంటుంది. మాకు గౌరవం ఇచ్చేవారు. మేము కోరగానే నా భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇచ్చారు’ అని అన్నారు. కాగా సురేఖ 2013లో గులాబీ పార్టీలో చేరి 2018లో కాంగ్రెస్ గూటికి వచ్చారు.