ఈ నెల 26 నుంచి భారతీయ దరఖాస్తుదారుల కోసం చైనా ప్రభుత్వం
వీసా నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు
వీసా కేంద్రాల ద్వారా సాగిన ఈ ప్రక్రియను నేరుగా దౌత్య కార్యాలయాల పరిధిలోకి మారుస్తూ, ఆన్‌లైన్ దరఖాస్తు, భౌతిక పత్రాల సమర్పణను తప్పనిసరి చేశారు. ముంబై కాన్సులేట్ పరిధిలోకి మహారాష్ట్ర, కర్ణాటకలను చేర్చగా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దరఖాస్తుదారులు ఢిల్లీ ఎంబసీని ఆశ్రయించాలి. అలాగే,
వీసా ఫీజులను డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.