ప్రభాస్‌తో కిషన్‌రెడ్డి భేటీ

2488பார்த்தது
డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'నషాముక్త్ భారత్' కార్యక్రమానికి మద్దతు కోరుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ను కలిశారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన ప్రభాస్‌ను ఆహ్వానించారు. వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, సుకుమార్, బోయపాటి శ్రీను, వెంకటేశ్‌లను కూడా కిషన్ రెడ్డి కలిసి పాల్గొనాలని కోరారు.

தொடர்புடைய செய்தி