ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం భారతదేశంలో తన అప్డేటెడ్ 200 డ్యూక్ బైక్‌ను రూ. 2.07 లక్షల ధరతో విడుదల చేసింది. మునుపటి మోడల్ కంటే దీని ధర రూ. 1,552 పెరిగింది. సరికొత్త రైడ్-బై-వైర్ థ్రాటిల్, స్ట్రీట్ మరియు రెయిన్ రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో చేర్చారు. క్లచ్ లేకుండా గేర్లు మార్చడానికి వీలుగా బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా అమర్చారు. లిక్విడ్-కార్బన్, బ్లాక్ రంగులలో లభించే ఈ బైక్‌లో ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పులు లేవు.