పొలంలో పిడుగు.. ఇద్దరు మహిళలు మృతి

1389பார்த்தது
పొలంలో పిడుగు.. ఇద్దరు మహిళలు మృతి
AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉప్పలపాడు గ్రామానికి చెందినవారు. మధ్యాహ్నం సమయంలో వాతావరణం మారి వర్షం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி