టిబెట్‌లో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 32 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. నాగ్‌కు సిటీలో వందలాది ఇళ్లు కూలిపోయాయని సమాచారం. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.