మహిళల్లో సాధారణంగా 45–55 ఏళ్ల మధ్య వచ్చే మెనోపాజ్ దశలో హార్మోన్ల మార్పుల కారణంగా పలు లక్షణాలు కనిపించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారిగా వేడి ఆవిర్లు రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, నిద్రలేమి, చిరాకు, ఆందోళన, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడంతో ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపొరోసిస్ ప్రమాదం పెరగవచ్చు. ఈ దశలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ సమృద్ధిగా ఉ
ండే సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నిద్రకు ప్రాధాన్యమివ్వాలి. లక్షణాలు తీవ్రంగా ఉన్నా, రోజువారీ పనులకు ఆటంకం కలిగించినా వైద్యుడిని సంప్రదించాలి.