అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం

4277பார்த்தது
అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం
TG: అమెరికాలో తెలంగాణకు చెందన ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. నల్గొండ (D) కనగల్ (M) శాబ్దులాపురం గ్రామానికి చెందిన శ్రీజ రెడ్డి కోయ ఏడాది క్రితం అమెరికా వెళ్లింది. బోస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో చదువుతోంది. నవంబర్ 2(సోమవారం) రాత్రి సుమారు 9.45 గంటలకు డోర్చెస్టర్ ప్రాంతం ఎడిసన్ గ్రీన్‌లో ఉన్న తన నివాసం నుంచి ఆమె బయటకు వెళ్లింది. శ్రీజ తిరిగి ఇంటికి రాకపోవడంతో నవంబర్ 3న ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీజ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி