భారత్తో జరిగిన ఐదో టీ20లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని కివీస్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ భారత బౌలర్లపై విరుచుకుపడి 50 బంతుల్లో 93 పరుగులు చేశారు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్స్ మరోసారి అర్ధశతకంతో రాణించారు. ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.