క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోంది. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హర్ష్ దీప్ వేసిన బంతికి టిమ్ సీఫెర్ట్(7) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఫిల్ అలెన్(5), డారిల్ మిచెల్(6) ఉన్నారు. 2.5 ఓవర్లూ పూర్తయ్యేసరికి కివీస్ స్కోర్ 18/1గా ఉంది. కాగా తొలి టీ20లో గెలిచిన
ఇండియా ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని చూస్తోంది.