మెడికవర్‌ ఘటనపై ఎన్‌హెచ్చార్సీ నోటీసులు

2025பார்த்தது
మెడికవర్‌ ఘటనపై ఎన్‌హెచ్చార్సీ నోటీసులు
TG: సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్ల శస్త్రచికిత్స అనంతరం 28 ఏళ్ల జూనియర్ న్యాయవాది ఐశ్వర్య మరణించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందించింది. ఈ ఉదంతంపై న్యాయవాది కారుపోతుల రేవంత్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, తెలంగాణ వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. శస్త్రచికిత్సకు ముందు సమ్మతి మరియు ప్రమాదాల వివరాలపై కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలపై విచారణ జరిపి, నాలుగు వారాల్లో పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி