టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి జతకట్టబోతున్నట్లు ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 'వకీల్ సాబ్' వంటి హిట్ రాగా, తాజాగా 'అర్జున' అనే టైటిల్‌తో పాన్-
ఇండియా రేంజ్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండగా, ఆయన షెడ్యూల్స్ క్లియర్ అయ్యాక ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.