10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!

4864பார்த்தது
10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!
దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 24వ విడత ఆర్థిక సాయాన్ని అక్టోబర్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గుజరాత్‌లోని బనాస్ కాంఠాలో ప్రధాని మోదీ స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో 9.34 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.18,680 కోట్లు జమ కానున్నాయి. వివిధ కారణాల వల్ల అనర్హులైన 10 లక్షల మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది.

தொடர்புடைய செய்தி