బెంగళూరులో షర్మిలను అడ్డుకున్న పోలీసులు

4592பார்த்தது
బెంగళూరులో షర్మిలను అడ్డుకున్న పోలీసులు
బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యలహంకలోని నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ షర్మిల, విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ అక్కడికి వెళ్లకూడదని పోలీసులు అనుమతి నిరాకరించడంతో, సుమారు 20 నిమిషాల పాటు పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్తానని షర్మిల పట్టుబట్టినప్పటికీ, పోలీసులు అనుమతించకపోవడంతో చివరికి వారు వెనుదిరిగారు.

தொடர்புடைய செய்தி