ఘనంగా ప్రారంభమైన ‘ప్రొడక్షన్ నంబర్ 1’ షూటింగ్

330பார்த்தது
ఘనంగా ప్రారంభమైన ‘ప్రొడక్షన్ నంబర్ 1’ షూటింగ్
సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాజీవ్ వర్మ, మలైకా టి. వాసుపాల్ జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. తర్వాతి షెడ్యూల్స్ కోనసీమలో జరగనుంది. అజయ్ ఘోష్, శివాజీ రాజా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி