నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (NCC) లిమిటెడ్ వ్యవస్థాపకులు అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (89) (AVS రాజు) కన్నుమూశారు. 1937లో తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో జన్మించిన ఆయన, 1978లో NCCని స్థాపించారు. ఈ సంస్థ 1992లో NSEలో లిస్ట్ అయింది. టర్నోవర్ (రూ.20,944 కోట్లు) పరంగా భారతదేశంలో రెండో అతిపెద్ద లిస్టెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీగా NCC నిలిచింది. 2010లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.