క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్- 2027లో
భారతదేశం సత్తా చాటింది. మొత్తం 52 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకోగా, అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఐఐటీ ఢిల్లీ (118) దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అలాగే, ఐఐటీ బాంబే (134), ఐఐటీ మద్రాస్ (170) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్ తన ర్యాంకును 76 స్థానాలు మెరుగుపరుచుకుని 588వ ర్యాంకు సాధించింది. ఆసియా ర్యాంకింగ్స్‌లోనూ తెలంగాణ విద్యాసంస్థలు చోటు సంపాదించాయి.