తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. హైదరాబాద్‌లో అలర్ట్

1307பார்த்தது
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. హైదరాబాద్‌లో అలర్ట్
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడమే కాకుండా, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 30 నుండి తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నేటి సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, రాత్రి వేళల్లో వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

தொடர்புடைய செய்தி