AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీలేరులోని గిరిజన బాలికల పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని ఏర్పాటు చేశారు. అక్కడికి ఓ మూషికం (ఎలుక) వచ్చింది.
విద్యార్థులు భజన చేస్తున్నప్పటికీ ఆ మూషికం స్వామి వారి వద్దే ఉండి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో స్కూల్ సిబ్బంది, విద్యార్థినులు మూషికానికి సైతం పూజలు చేసి, ప్రసాదాలు సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.