ఢిల్లీలోని
బీజేపీ,
కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర నేతలకు కనీస విలువ ఇవ్వరని
కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ పదవుల హోదాను విస్మరించి బౌన్సర్ల కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎర్రవెల్లిలో అమరవీరుల కాలనీ కడతామని రేవంత్ రెడ్డి అంటున్నారని, అంత దూరంలో కాకుండా మియాపూర్ భూముల్లోనే పేదలకు, ఉద్యమకారులకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.