TG: వర్షాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,224 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సీజన్లో 56.59 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ముందుగా వరినాట్లు వేయడంతో అక్కడే కొనుగోళ్లు మొదలుకానున్నాయి.