వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి

3146பார்த்தது
వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి
వియత్నాంలో జరిగిన బైక్‌ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యోగా శిక్షకులు మృతి చెందారు. రాంచీకి చెందిన రాజా కుమార్‌ వర్మ (26), జమ్‌షెడ్‌పూర్‌కు చెందిన వినయ్‌ యాదవ్‌ (23) డా లాట్‌లో యోగా క్లాసులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. బురద రోడ్డుపై వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. వర్మ అక్కడికక్కడే మృతి చెందగా.. యాదవ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను స్వదేశానికి తీసుకువస్తామని కుటుంబ సభ్యులకు జార్ఖండ్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

தொடர்புடைய செய்தி