డేటింగ్ యాప్ పేరుతో రూ. 20 లక్షల దోపిడీ

2250பார்த்தது
డేటింగ్ యాప్ పేరుతో రూ. 20 లక్షల దోపిడీ
బెంగుళూరులోని నాగరాబావిలో అక్టోబర్ 23వ తేదీన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ట్రాన్స్‌జెండర్లు, హర్షవర్ధన్ అనే వ్యక్తిని కత్తులతో బెదిరించి రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు చంద్రలేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు స్పందించి నజియా, సయ్యద్ మౌషీన్ అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி