VIDEO: రూ.4 కోట్లు.. 108 కిలోల వెండి గణపతి

3778பார்த்தது
మహారాష్ట్రలోని జల్నాలో 108 కిలోల వెండితో తయారు చేసి, బంగారు పూత పూసిన సుమారు 4 కోట్ల రూపాయల విలువైన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనోఖా గణేశ్‌ మండల్‌ వ్యవస్థాపకుడు అజయ్‌ భారతీయ ప్రకారం, ఈ విగ్రహాన్ని గతంలో 107 కిలోల వెండితో తయారు చేయించారు. ఇటీవల 50 తులాల బంగారంతో పూత వేయించడంతో దీని బరువు 108 కిలోలకు చేరింది. ఈ విగ్రహాన్ని ఏడాది పొడవునా సురక్షితంగా ఉంచి, గణేష్ చతుర్థి ఉత్సవాల సమయంలో మండపంలో ప్రతిష్ఠిస్తారు.

தொடர்புடைய செய்தி