దివ్యాంగ విద్యార్థులకు స్కూటీలు!

2401பார்த்தது
దివ్యాంగ విద్యార్థులకు స్కూటీలు!
TG: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,000 మంది దివ్యాంగ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 2026-27లో మూడు చక్రాల స్కూటీలను అందించాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం రూ.10 కోట్లు కేటాయించారు. ఈ స్కూటీలు పెట్రోల్, విద్యుత్ రెండింటితో నడిచేవిగా ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక ప్రక్రియ జిల్లా స్థాయిలో జరుగుతుంది. వైకల్యం తీవ్రత ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

தொடர்புடைய செய்தி