ఇల్లు కట్టే ముందు ఇటుకలను నీటిలో ఎందుకు నానబెడతారు?

4577பார்த்தது
ఇల్లు కట్టే ముందు ఇటుకలను నీటిలో ఎందుకు నానబెడతారు?
ఇల్లు నిర్మించేటప్పుడు ఇటుకలను నీటిలో నానబెట్టడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది. పొడి ఇటుకలు సిమెంట్ మిశ్రమంలోని తేమను పీల్చుకోవడం వల్ల సిమెంట్ గట్టిపడదు. దీనివల్ల గోడలకు పగుళ్లు వస్తాయి. ఇటుకలను ముందుగానే తడపడం ద్వారా సిమెంట్ బలం పుంజుకుంటుంది. గోడలు పటిష్టంగా ఉంటాయి. సాంప్రదాయ బట్టీ ఇటుకలను 1-2 గంటలు నానబెట్టాలి. కానీ ఫ్లైయాష్ బ్లాక్స్‌కు కేవలం నీటిని చిలకరిస్తే సరిపోతుంది. నిర్మాణం తర్వాత కూడా కనీసం 7-10 రోజుల పాటు గోడలపై నీళ్లు కొట్టడం భవిష్యత్ భద్రతకు అత్యంత అవసరం.

தொடர்புடைய செய்தி