బ్యాంకు ఉద్యోగుల యూనియన్ UFBU తలపెట్టిన సమ్మె వాయిదా పడటంతో నేటి(సోమవారం) నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. సమ్మె వాయిదాతో తమ బ్రాంచ్లు, బ్యాంకింగ్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఎస్బీఐ అడ్వైజరీ జారీ చేసింది. కస్టమర్లు చూపించిన సహనానికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఇతర బ్యాంకుల సేవలు కూడా యథావిధిగా పనిచేయనున్నాయి.