TG: ములుగు జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై శిక్షణా తరగతులను బుధవారం మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలని, ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించి
ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. గ్రామీణ యువతకు మెరుగైన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.