
కోదాడలో మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలి
సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో గత 26 ఏళ్లుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వార్డులో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. విద్యుత్, మైక్ అనుమతుల్లో ఇబ్బందులు లేకుండా కమిటీ సహకరిస్తుందని, నవరాత్రులను భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యాద రమేష్, అక్కిరాజు యశ్వంత్, సాతులూరి హనుమంతరావు, గోదేశి లక్ష్మణ్, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, అంబటి కర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.








































